ఆదిలాబాద్ లోని రైల్వే స్టేషన్ సమీపంలో పాత జాతీయ రహదారి పక్కన రైల్వే ప్రహరీ గోడ పక్కన చెట్ల పొదల్లో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు శవాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. మృతుడి వయసు దాదాపు 40-45 మధ్య ఉండొచ్చని టూటౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేదన్నారు. విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.