నేను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడం లేదు. పెద్దారెడ్డి బాధితులు, ప్రజలే ఆయన్ని తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వరని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. పెద్దారెడ్డి అక్రమాలను, అరాచకాలను భరించలేక ప్రజలే తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా జేసీ పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అవినీతి, అక్రమాలను ఆధారాలు తో సహా విలేకరులకు చూపించారు.