తూప్రాన్ పరిధిలోని ఇస్లాంపూర్, వెంకటరత్నాపూర్ గ్రామాలలో పనుల జాతర -2025 కార్యక్రమాన్ని డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి పండుగ వాతావరణంలో కలెక్టర్ ప్రారంభించారు. ముందుగా ఇస్లాపూర్ గ్రామంలో 3 లక్షల అంచనా వ్యయంతో ఎస్.బి.ఎం గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల బ్లాకును కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం వెంకటరత్నాపూర్ గ్రామంలో92 వేల రూపాయల వ్యయంతో పశువుల పాక నిర్మాణానికి శంకుస్థాపన, 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భావన సముదాయాన్ని కలెక్టర్ ప్రారంభించారు.