కావలి మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై కక్షపూరితంగానే హత్యాయత్నం కేసు పెట్టారని వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు నాగార్జున ఆరోపించారు. అన్నవరం క్వారీలో అక్రమాలు బయటపడతాయనే కావాలి ఎమ్మెల్యే ఇలాంటి కేసు పెట్టించారని మండిపడ్డారు. కావ్య కృష్ణారెడ్డి అక్రమాలు కచ్చితంగా బయటకు తీస్తామని ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాకు తెలిపారు.