జిల్లాలో పంట నష్టం సర్వే, యూరియా పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం సాయంత్రం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సముదాయంలో వ్యవసాయ శాఖ అధికారులు,సహకార శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసినందున 15 వేల ఎకరాల వరకు పంట దెబ్బతిన్నందున పంట నష్టం సర్వే నిర్వహించి వెంటనే నివేదికలు అందించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పంట నష్టపోయిన రైతుల వివరాలు మాత్రమే నమోదు చేయాలని, అనర్హుల పేర్లు జాబితాలో ఉండకూడదని తెలిపారు. త్వరలో జిల్లాకు వచ్చే యూరియా పంపిణీ పకడ్బందీగా చేపట్టాలన్నారు.