రైతులను వివిధ రూపాలలో యూరియా, గిట్టుబాటు ధర, పత్తి దిగుమతి లాంటి విషయాలలో అన్ని కోనాలలో మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టండని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె ప్రభాకర రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు నగరం లోని కొత్తబష్టాండ్ ఇందిరాగాంధీ నగర్ లో ఉన్న సుందరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కమిటి సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి యస్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ఎర్రకోట నుండి ఆగస్టు 15న దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాటల శబ్దం ఆగక ముందే కేంద్ర ఆర్థిక శాఖ రైతుల పై భారాలు వేసే ప్రయత్నం