గోకవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గోకవరం నుంచి కాకినాడ వెళుతుండగా గురువారం ఉదయం సమయంలో మార్గ మధ్యలోనే జగ్గంపేట మండలం మల్లిసాల శివారు ఉన్నా దండుగులమ్మ తల్లి ఆలయ సమీపము వద్ద వచ్చేసరికి బస్సు యొక్క వెనుక చక్రం పంచర్ కావడంతో రోడ్డుపై నిలిచిపోయింది. అయితే బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 80 మంది ప్రయాణికులు రోడ్డుమీద నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.