పల్నాడు జిల్లా,దాచేపల్లి మండలం,పెదగార్లపాడు శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు.ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిన దగ్గర నుండి ఫ్యాక్టరీ నే నమ్ముకుని బ్రతుకుతున్నామని,ఉన్నట్టుండి వెళ్లిపొమ్మంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.ఈ క్రమంలో కార్మికులందరు సోమవారం మధ్యాహ్నం దాచేపల్లి తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు.