గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అంతర్గత డ్రైన్లలో వ్యర్ధాలు నిల్వకుండా ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం సాయంత్రం ఏటి అగ్రహారం, అంకమ్మ నగర్, కంకరగుంట ఆర్యూబి, బ్రాడిపేట, అరండల్ పేట పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున అంతర్గత డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా డ్రైన్లు పొంగే సమస్య రాకుండా చూడవచ్చన్నారు.