జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం గజపతినగరం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఎస్ఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తైక్వాండో మాస్టర్ శ్రీనివాసరావు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ పై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.