ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో కార్యక్రమం నేడు ఆదివారం రోజున ఉదయం 7 గంటలకు నిర్వహించారు. గత వారం రోజులుగా తిరుగుతున్నా ఒక బస్తా యూరియా కూడా దొరకడం లేదని, అధికారులు రేపు, మాపూ.. అంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రైతులతో చర్చించి యూరియా ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.