జియ్యమ్మవలస మండలం బీజేపురం పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్ పై పోలీసులు సోమవారం అవగాహన కల్పించారు. శక్తి టీం సభ్యులు ఎల్. శ్రీనివాసరావు, నిర్మల తదితరులు విద్యార్థులకు శక్తి యాప్ వినియోగం గూర్చి అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో 112 కు కాల్ చేయాలన్నారు. మహిళల భద్రత లక్ష్యంగా శక్తి యాప్ ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.