నిడదవోలు మండలం రావిమెట్లలో నిర్వహిస్తున్న కోడిపందాల శిబిరంపై సమీశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందర్రావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బుధవారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 10,500 నగదు, మూడు కోడిపుంజులు స్వాధీనం చేసుకుందామని ఎస్ఐ తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఈ సందర్భంగా హెచ్చరించారు.