షాద్నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తూరు నందిగామ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం మధ్యాహ్నం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి సీఎం సహాయ నిధి ఆపదలో అండగా నిలుస్తుందని అన్నారు. ఆపద సమయంలో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మెరుగైన వైద్యానిక అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.