రైతుల అవగాహన కోసం గంట్యాడ మండలంలోని నరవ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం డ్రోన్ ద్వారా నానో ఏరియాను వరిచేలపై పిచికారి చేసే విధానంపై ప్రయోగాత్మక డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా గంట్యాడ మండల వ్యవసాయాధికారి బి శ్యాం కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న విజయనగరం వ్యవసాయ శాఖ ఏ డి నాగభూషణం మాట్లాడుతూ, నానో ఏరియా వినియోగం వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి అన్నారు. విజయనగరం వ్యవసాయ శాఖ జెడి కార్యాలయం ఏ డి ఏ విజయ్ కుమార్, జిల్లా వనరుల కేంద్రం ఏ డి ఏ భారతి, రైతులు వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.