ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జోత్సవాలు కన్నుల పండగ సాగుతున్నాయి. వివిధ కాలనీల నుండి మొదలైన నిమజ్జన శోభాయాత్రలు పట్టణంలోని ప్రధాన రోడ్ల కు చేరుకుంటున్నాయి. బ్యాండ్ మేళాలు, డిజె సౌండ్ సిస్టం, డప్పుచప్పుల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏ వినాయకుని వద్ద చూసిన సందడి వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో పట్టణం జనసంద్రంగా మారింది. మహిళలు యువతులు సైతం ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు అటు నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.