స్వామి వివేకానంద యువతకు ఆదర్శవంతులని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బనగానపల్లెలోని వాసవీ పాలిటెక్నిక్ కళాశాలలకు స్వామి వివేకానంద 132వ చికాగో సర్వమత సంస్మరణ సభకు హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. నేటి యువత గట్టి సంకల్పంతో ముందుకు వెళ్లాలని, ఏదైనా మనస్సు తటస్థంగా ఉంచి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు.