సి.బెలగల్ మండలంలోని పోలకల్ గ్రామ సమీపంలో వాగులో ఆర్టీసీ బస్సు ఆగిపోవడంతో స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం భారీ వర్షం కురవడంతో వాగు ఉధృతంగా ప్రవహించింది. ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు వాగు దాటే క్రమంలో మధ్యలో ఆగిపోయింది. దీంతో స్థానికులు స్పందించి ట్రాక్టర్ సాయంతో బస్సును బయటకు లాగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.