గజపతినగరం మండలంలోని కొత్త బగ్గామ్ గ్రామంలో పాత కక్షలతో శ్రీను అనే వ్యక్తిని హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు శుక్రవారం రాత్రి గజపతినగరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బొబ్బిలి డిఎస్పి భవ్య రెడ్డి తెలిపారు. పాత కక్షలతో అన్న అయిన శ్రీనును కత్తితో పొడిచి చంపిన తమ్ముడు చంటి తో పాటు గుమ్మడి రామచంద్రుడు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందన్నారు సమావేశంలో గజపతినగరం సిఐజి ఏ వి రమణ, ఎస్ ఐ కిరణ్ కుమార్ నాయుడు పాల్గొన్నారు..