జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం మహానంది నుంచి బోయలకుంట్ల వైపు వెళ్లే దారిలోని పాలేరు వాగు పొంగిపొర్లుతోంది. నల్లమల అడవి నుంచి వచ్చే వరద పాలేరు వాగు బ్రిడ్జిపైన అడుగులోతు పారుతుంది. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.