అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్,. గారి ఆదేశాల మేరకు, పోలీసులు, విద్యార్థులకు భద్రత, చట్టాలపై అవగాహన కల్పించేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా, గురువారం పలు పాఠశాలల్లో శక్తి టీమ్ బృందాలు విద్యార్థులతో సమావేశమయ్యాయి.ఈ సమావేశాల్లో, విద్యార్థులకు ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టం చేస్తూ, అపరిచితులు లేదా ఇతరుల నుంచి ఎదురయ్యే అనుచిత ప్రవర్తనను ఎలా గుర్తించాలో తెలియజేశారు. స్వీయ రక్షణ పద్ధతులు, ఈవ్ టీజింగ్, మరియు ప్రేమ పేరుతో జరిగే మోసాలపై కూడా అవగాహన కల్పించారు.