Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ కాలుష్య నివారణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని ప్రజలకు మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలందరూ జిల్లాలో మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకొని పూజించాలని, తద్వారా కాలుష్య నివారణకు ప్రజలు సహకరించి మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.