నల్లగొండ జిల్లా: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి కట్టంగూరు మండలం ఐటిపాముల లోని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నంత పాఠశాలను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల వంటగదిని పాఠశాల పరిసరాలను పరిశుభ్రతను డైనింగ్ హాల్ ను పరిశీలించారు. అంతేకాక విద్యార్థులకు వండిన వంటలను తనిఖీ చేశారు. అన్నం మెత్తగా అవ్వడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ సరైన మోతాదులో ఉంటారని వంటవారిని ఆదేశించారు. వంటగది డైనింగ్ హాల్ కు ఇదివరకు నిధులు మంజూరు చేసినందున త్వరితగతిన స్థానిక శాసనసభ్యుల ద్వారా పనులను ప్రారంభించాలని ఆదేశించారు.