లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని,లంబాడీలు, బంజారాలకు ఎస్టీ సర్టిఫికెట్ జారీ చేయవద్దని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆదిలాబాద్ రూరల్ మండలం గొండ్వాన పంచాయతీ, ఉమ్మడి రాయి సెంటర్ 9 తెగల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.ముందుగా ముత్యాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి, డోల్ వాయిద్యాలతో పెద్దఎత్తున ర్యాలీ చేపట్టి అదిలాబాదులోని కొమురంభీమ్ చౌక్ లో భీమ్ విగ్రహానికి నివాళులు అరిపించారు. అనంతరం కలెక్టరేట్ ర్యాలీలో పాల్గొన్నారు...