ఏడాది కూటమి ప్రభుత్వ సూపరిపాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం కాకినాడ నగరంలోని 19వ డివిజన్లో జనసేన పార్టీ నాయకురాలు బొట్ట లీల ఆధ్వర్యంలో వీర మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పాల్గొనగా విశిష్ట అతిధిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దొగ్గన బాబ్జి పాల్గొన్నారు. ముందుగా రామాలయంలో అతిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు నివాళ్లుఅర్పించారు.