ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు జీరో పాయింట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న టిప్పర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఒకరు తీవ్రంగా గాయపడంతో నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది