నల్లగొండ జిల్లా:భూమికోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం జరిగిన మహోత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈనెల 10న చాకలి ఐలమ్మ వర్ధంతి నుంచి 17 వరకు జరిగే సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.మంగళవారం సిపిఎం పట్టణ కమిటీ సమావేశం సుందరయ్య భవన్లో నిర్వహించారు.తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనలో జరుగుతున్న దోపిడీ పీడన వెట్టి చాకిరికి దొరల జామిందార్లు జమిందార్లకు వ్యతిరేకంగా జరిగిన మహోత్సవ పోరాటంలో కమ్యూనిస్టు యువతను యోధులు అనేక త్యాగాలు చేసి ప్రజలకు అండ ఉన్నారన్నారు