ఆదోనిలో కురిసిన భారీ వర్షానికి సీఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చి ప్రాంగణంలో బీడీఎం ఆఫీస్ ఎదురుగా ఉన్న ఏళ్ల నాటి వేప చెట్టు కూకటి వేళ్లతో నేల కూలింది. అర్ధరాత్రి జన సంచారం లేని సమయంలో కూలడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. చెట్టును తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ఎవరూ స్పందించడం లేదని స్థానికులు వాపోయారు.