తిరుపతి జిల్లా SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, DSP చెంచు బాబు సూచనలతో నేర నియంత్రణ చర్యలలో భాగంగా సూళ్లూరుపేటలోని పలు లాడ్జీలలో పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం కూడా దొరవారిసత్రం SI అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పలు లాడ్జిల్లో తనిఖీలు చేశారు. లాడ్జీ గదుల్లో మైనర్లు బస చేయకుండా చూడాలని లాడ్జి యాజమాన్యానికి సూచించారు. గదులు తీసుకునేందుకు వచ్చే వారి దగ్గర ఆధార్ కార్డు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట