రాజమండ్రి కాంగ్రెస్ లో ఏర్పడిన విభేదాలను పక్కనపెట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి పనిచేయాలని పిసిసి అధ్యక్షురాలు షర్మినార్ రెడ్డి సూచించినట్లు, ఇసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ, జిల్లా అధ్యక్షుడికి, రాజమండ్రి అధ్యక్షుడికి మధ్య విభేదాలు తొలగిపోయాయన్నారు, ఇకపై పార్టీ కోసమే పని చేస్తారని చెప్పారు.