ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలన అధికారి రవీంద్ర రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు ఐదు సెమిస్టర్ల పరీక్ష ఫీజు మరియు కళాశాల ఫీజులను కట్టాలని బలవంతం చేస్తున్నారన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీ అకౌంట్లో జమ అయినప్పటికీ విద్యార్థులు కట్టాలని వేధిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.