ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త హాస్టల్ భవనాలను ప్రారంభించి, 10 కోట్లతో డిజిటల్ లైబ్రరీ పనులకు శ్రీకారం చుట్టారు. వర్సిటీలో పెండింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యార్థులు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళను ఉన్నారు. భద్రత వలయంలో సీఎం పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ లేదని అన్నారు. మీ సమస్యలు ఏమున్నా చెప్పండి ఏం కావాలో చెప్పండి అన్ని పరిష్కరిస్తామని విద్యార్థులతో అన్నారు.