కర్నూలు జిల్లాలో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని డివైఎఫ్ఐ ఆరోపించింది. కొంతమంది అభ్యర్థులను పిలవకుండానే, వారి తర్వాత ర్యాంకు పొందిన వారికి వెరిఫికేషన్ నిర్వహించారని విమర్శించింది. బీసీ–బీ రిజర్వేషన్‌లో 2630 ర్యాంకు వచ్చిన మహిళకు వెరిఫికేషన్ పూర్తి చేసి, అంతకుముందు ర్యాంక్ ఉన్న వారిని పక్కనపెట్టినట్లు వెల్లడించింది. ఇదే విధంగా బీసీ–డి రిజర్వేషన్ విభాగంలో కూడా వెరిఫికేషన్‌లో ఇలాంటి అన్యాయం జరిగిందని పేర్కొంది.ఈ విషయంపై స్పష్టతనిచ్చి, అభ్యర్థుల అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి నగేష్, జిల్లా అధ్యక్ష–