పూలాజీ బాబా జీవితం సమస్త మానవాళికి ఆదర్శమని ASF జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. జైనూర్ మండలంలోని పాట్నాపూర్ లో శనివారం శ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా 101వ జయంతిలో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తో కలసి పాల్గొన్నారు. బాబా చిత్రపటం వద్ద పూజలు నిర్వహించారు. పూలాజీ బాబా ప్రవచనాలు ప్రజల్లో మార్పును తీసుకువచ్చాయన్నారు. చెడు మార్గంలో నడిచేవారు బాబాను దర్శించుకొని మంచిగా మారిన కుటుంబాలెన్నో ఉన్నాయని పేర్కొన్నారు.