పెంట్లవెల్లి మండల కేంద్రంలో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చోటిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెంట్లవెల్లి గ్రామానికి చెందిన రాజుకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండు నెలల క్రితం తన భార్య పుట్టింటికి వెళ్లడంతో కుటుంబంలో కలహాలు చోటు చేసుకున్నాయి. తన భార్య కాపురానికి రావడంలేదని మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతుడి తండ్రి శ్రీనివాసులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఏఎస్ఐ ఖాయం తెలిపారు.