యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని అడ్డగూడూరు మోత్కూరు మండలానికి చెందిన దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన కమిటీ లబ్ధిదారుడు రఘుపతి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకం కింద నిధులను మంజూరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో గ్రౌండ్ చేసి దళితులను ఆదుకోవాలని అన్నారు.