కణేకల్లు మండలం యర్రగుంట ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత చేపలు శుభ్రం చేయించిన వీడియో వెలుగులోకి వచ్చింది. మారెమ్మ జాతర సందర్భంగా మంగళవారం పాఠశాలలో టీచర్లు వంట ఏజెన్సీ వారితతో చేపల కూర చేయించుకునే క్రమంలో ఈ వీడియో వెలుగులోకి వచ్చి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా చేపల కూర వండి వడ్డించడానికి పిల్లలతో శుభ్రం చేయించడంపై తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.