రామాయంపేట మున్సిపాలిటీలో శనివారం పలు అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపన చేశారు. సిద్దిపేట చౌరస్తా నుండి ఎస్సీ కాలనీ వరకు, పోలీస్ స్టేషన్ నుండి మెదక్ బ్రిడ్జి వరకు నూతనంగా నూతనంగా చేపట్టిన సెంట్రల్ లైటింగ్ ను టిపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాత రావు ప్రారంభించారు. దాదాపు రెండు కోట్ల రూపాయలతో 200 బటర్ ఫ్లై లైట్లు ఏర్పాటు చేస్తూ ఎమ్మెల్యే రోహిత్ రావ్ ప్రత్యేక నిధులు కేటాయించారని ఈ సందర్భంగా వారు తెలిపారు మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సెంట్రల్ లైటింగ్ ప్రారంభం కావడం శుభసూచకమన్నారు.