కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో హెడ్ నర్సులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయన ఛాంబర్ లో సమీక్షా సమావేశంలో నర్సింగ్ సిబ్బంది విధులు, రోగుల పట్ల ప్రవర్తన, ఔషధాల పంపిణీ, శుభ్రత, మరియు అత్యవసర పరిస్థితులలో అనుసరించవలసిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.