తిరుపతి.కొర్లగుంట లో యువకుల మధ్య జరిగిన దాడిలో అశోక్ అనే వ్యక్తి కత్తితో ముగ్గురు పై దాడి చేశాడు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చందు అనే వ్యక్తి మృతి చెందగా సుధాకర్, హేమంత్, అశోక్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో అశోక్ పరిస్థితి విషమంగా ఉంది. ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది.