భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులో నిర్వహిస్తుందని, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని,జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు.ఈరోజు దంతాలపల్లి మండలం పరిధిలోని పలు రెవిన్యూ గ్రామాలలో ఏర్పాటుచేసిన, భూభారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరై,ప్రజల నుండి ఆర్జీలను స్వీకరిస్తున్న తీరును పరిశీలించారు.భూ సమస్యలు ఉన్నవారు రెవిన్యూ సదస్సులో పాల్గొనాలని, ధరస్కాస్తులు స్వీకరించి నూతన చట్టం ప్రకారం భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.