దేవరపల్లి పోలీసులు పేకట శిబిరంపై దాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. దేవరపల్లి గ్రామంలోని పల్లంట్ల రోడ్డులోని పోలవరం కాలువ గట్టు శివారులో పేకాట ఆడుతున్న వీరిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 15,420 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు, వీరందరూ దేవరపల్లి గ్రామస్తులేనని ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.