పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు గంజాయి నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ నారాయణస్వామి గురువారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. స్థానిక తహసిల్దార్ మరియు సిబ్బందితో కలిసి జానస్పర్ కాలనీ సమీపంలో గంజాయి అమ్మకం, వినియోగం చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి రూ.30,000/- విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను రిమాండ్ కోసం జైలుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.