జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (BMS) ఆధ్వర్యంలో నిర్వహించన కార్మిక పోరాట బహిరంగ సభకు హాజరైన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల సమస్యలపై మాట్లాడారు ఈటెల రాజేందర్ సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఏకైక యూనియన్ బి ఎం ఎస్ అని,కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, సింగరేణి సంస్థ ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటా 40 శాతం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు ఎంపీ ఈటల రాజేందర్.