రైతులు, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించే విధంగా జీఎస్టీ స్లాబ్ ల తగ్గింపు హర్షనీయమని పి.గన్నవరం మండలం నాగుల్లంకకు చెందిన బీజేపీ బిల్డింగ్ వర్కర్స్ సొసైటీ జిల్లా కన్వీనర్ చిట్నీడి రంగసాయి అన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోడీ సముచిత నిర్ణయం తీసుకున్నారన్నారు. జీఎస్టీ రెండు స్లాబులుగా విడదీయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 33 రకాల ఔషధాల ధరలు తగ్గుతాయన్నారు.