మన ఇంటి ఆడపిల్ల మీద మీ కుట్రలు ఏంటి అంటూ జేసి ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రావణి విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వైరల్ వీడియోల గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. దళిత మహిళ ఎమ్మెల్యేగా శ్రావణిని చూసి ఓర్వలేక కొంతమంది ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రావణి పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న టిడిపి నాయకులకు ఇది సరైనది కాదని హెచ్చరించారు. అవకాశం ఉంటే వైసిపి నాయకులు చేస్తున్న అరాచకాలు, అక్రమాలపై ప్రశ్నించాలన్నారు. దళితరాలైన శ్రావణి పై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదన్నారు.