వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నిర్మల్ పట్టణంలోని మార్కెట్ లో సందడి వాతావరణం నెలకొంది. గణనాయకులను వారి వారి ఇండ్లలో పూజించడానికి వినాయక విగ్రహాలు, వివిధ రకాల పూజ వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రజలు మార్కెట్ కి రావడంతో రద్దీ నెలకొంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.