నగర పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని దేవాపురం పీకల వాగులో పెద్ద ఎత్తున వ్యర్ధాలు పేరుకుపోయి మురుగునీరు ప్రవాహానికి ఇబ్బంది కలిగి, కొద్దిపాటి వర్షానికి వాగు మునిగిపోయి రోడ్లపైకి, ఇళ్లల్లోకి మురుగునీరు ప్రవహిస్తుందని స్థానికుడు పిల్లి బాబురావు అనే వ్యక్తి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని దేవాపురం పీకల వాగు వద్ద నుండి మాట్లాడారు ఎన్ని ప్రభుత్వాలు మారిన, ప్రజా ప్రతినిధులు మారుతున్న పీకల వాగు పరిస్థితి మాత్రం మారడం లేదన్నారు.