కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక స్వామిలేఖ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్ అనే మహిళను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కూకట్పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.