బ్రహ్మసముద్రం మండలం గుడిమేపల్లికి చెందిన ఆరేళ్ల చిన్నారి హేమాశ్రీ అనంతపురంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. ఈనెల 5వ తేదీన హేమాశ్రీ పాముకాటుకు గురైంది. తల్లిదండ్రులు మల్లికార్జున, మారెక్క హేమాశ్రీని కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు అనంతపురం రెఫర్ చేశారు. అనంతపురంలో చికిత్స పొందుతూ హేమాశ్రీ మృతి చెందింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.